మహిళల చైతన్యంతోనే గ్రామాల్లో అభివృద్ధి


Sun,August 25, 2019 01:13 AM

సిద్దిపేట రూరల్ : మహిళలు చైతన్యవంతమైనపుడే గ్రామాలు అభివృద్ధ్ది చెందుతాయని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో జరిగిన మహిళా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ బుస్సాపూర్ ఆదర్శ గ్రామంగా మారాలంటే మహిళల భాగస్వామ్యం ఉండాలన్నారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు
. మనిషికి మొదటి శత్రువు దోమలే అని పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నపుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలు నిర్మించి, ఖచ్చితంగా ఉపయోగించాలన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేసి, పరిశుభ్రత పాటిస్తామని మహిళలు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం లో ఎంపీడీవో సమ్మిరెడ్డి, వైస్ ఎంపీపీ శేరిపల్లి యాదగిరి, సర్పంచ్ సదాశివరెడ్డి, ఎంపీటీసీ ఎల్లం, పంచాయతీ కార్యదర్శి రంజిత్, ఏపీఎం విజయనిర్మల, మహిళలు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...