గ్రామాల్లో జలశక్తి అభియాన్ సదస్సులు


Sun,August 25, 2019 01:13 AM

జగదేవ్‌పూర్: జలసంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండలంలోని సర్పంచులు అన్నారు. శనివారం మండలంలోని అలీరాజ్‌పేట, తీగుల్-నర్సాపూర్, చాట్లపల్లి, పలుగుగడ్డ తదితర గ్రామాల్లో జలశక్తి అభియాన్‌పై గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జల సంరక్షణకు ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంను విజయవంతం చేయాలని అన్నారు. హోమ్‌స్టిడ్ ప్లాంటేషన్‌లో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లక్ష్మి, రజిత, రాజేశ్వరి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కిరణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మండలంలోని నర్సన్నపేట, చేబర్తి, భావానందపూర్, పాములపర్తి, ఎర్రవల్లి, దామరకుంట గ్రామల్లో జలశక్తి అభియాన్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాములపర్తి గ్రామసభకు ఎంపీపీ పాండుగౌడ్ హాజరై జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. మండలాన్ని హరితహారంలో భాగంగా ఆకుపచ్చ మండలంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆయా సర్పంచ్‌లు భావానందపూర్ సర్పంచ్ నాగరాజు, చేబర్తి సర్పంచ్ అశోక్, దామరకుంట సర్పంచ్ రమ్య, పాములపర్తి సర్పంచ్ తిరుమల రెడ్డి, ఎర్రవల్లి

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...