అనుమానాస్పదస్థితిలో వృద్ధుడి మృతి


Sun,August 25, 2019 01:12 AM

బెజ్జంకి: బెజ్జంకి సత్యార్జున గార్డెన్‌లో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న వేములవాడ నర్సయ్య(75) అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. నర్సయ్య చాలా సంవత్సరాలుగా సత్యార్జున గార్డెన్‌లో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం నర్సయ్య భార్య మైసవ్వ ఇంటి నుంచి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చింది. కాగా నర్సయ్య ఫంక్షన్‌హాల్‌లో తనకు కేటాయించిన గదిలో పడుకున్నాడు. శనివారం ఉదయం 10 దాటినా నర్సయ్య ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య వచ్చి గది తలుపులు తీసి చూడగా రక్తమరకలతో మృతి చెంది ఉన్నాడు.మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...