పేదలకు ఆపన్నహస్తం సీఎంఆర్‌ఎఫ్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి


Sun,August 25, 2019 01:11 AM

సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి : వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిధి ఆపన్నహస్తం అందిస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షలాది రూపాయలు వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి అందిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పలువురికి ఎల్‌వోసీ(లెటర్ ఆఫ్ క్రెడిట్)లు అందించారు. జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లికి చెందిన జే. చంద్రారెడ్డి నరాల బలహీనతతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఇతనికి సీఎం సహాయనిధి నుంచి లక్ష రూపాయలకు సంబంధించిన ఎల్‌వోసీ అందించారు.
టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుండా రంగారెడ్డి, సంతోష్‌రెడ్డి, పీర్లపల్లి సర్పంచ్ యాదవరెడ్డి, జగదేవ్‌పూర్ మాజీ సర్పంచ్ కరుణాకర్‌రెడ్డిలు ఎల్‌వోసీను ఎంపీ నుంచి తీసుకున్నారు. దౌల్తాబాద్ మండలం గాజుపల్లికి చెందిన కనకయ్య గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇతనికి చికిత్స కోసం రూ.2.50 లక్షలకు సంబంధించిన ఎల్‌వోసీని దొమ్మా ట ఎంపీటీసీ మోహన్‌రావు, గాజులపల్లి సర్పంచ్ శ్రీనివాస్‌లకు ఎంపీ అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం వివిధ కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే వారికి ఎల్‌వోసీలు, చికిత్స చేయించుకున్న వారికి కూడా ఆర్థికంగా చేయూతనందిస్తున్నట్లు ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. ఆరోగ్యకరమైన తెలంగాణ కోసం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించనున్నట్లు ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తుచేశారు.
అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రతి ఒక్కరి రక్తనమూనాలు సేకరించి అన్ని వ్యాధులకు సంబంధించి హెల్త్‌రిపోర్టు తయారు చేసే కార్యక్రమం తర్వలోనే మొదలయ్యే అవకాశమున్నదన్నారు. ఈ సందర్భంగా వైద్య సేవలు పొందనున్న వారికి ఫోన్లు చేసి ఆరోగ్యం బాగా చూసుకోవాలని సూచించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...