ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు


Sun,August 25, 2019 01:10 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ: కృష్ణాష్టమి వేడుకలను చేర్యాల పట్టణంతో పాటు చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రధానార్చాకుడు మంగళగిరి శేషాచార్యులు, రాజుస్వామి, మూర్తి స్వామి ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, స్వామి వారికి అలంకరణ, ద్వాదశ నైవేద్యాలు విష్ణు భగవద్గీతా పారాయణాలు తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఉట్లు కొట్టి, కోలాటాలాడి, ఊంజల్ సేవ, తులసీ, పుష్పాభిషేకాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు శేషాచార్యులు తనియ విన్నిపం, శ్రీకృష్ణ జనన, అవతారాల వైశిష్టాన్ని ప్రవచించారు. అలాగే వీహెచ్‌పీ ఆధ్వర్యంలో వీహెచ్‌పీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు కృష్ణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, వీరబత్తిని సత్యనారాయణ, తడ్క లక్ష్మణ్, ఉప్పల నాగరాజు, అల్లాడి శ్రీనివాస్, ఐతా సంపత్, చిగుళ్లపల్లి శ్రీనివాస్, వంగ జయ, రాధ, ఉమాదేవి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...