గ్రామ కమిటీల ఏర్పాటు


Sun,August 25, 2019 01:09 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ పాలనలో రైతు కుటుంబాలు ఆనందంగా జీవనం సాగిస్తున్నాయని టీఆర్‌ఎస్ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేశంగౌడ్ అన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కమిటీల ఎన్నికల్లో భాగంగా మండలంలోని వేచరేణి గ్రామంలో శనివారం గ్రామ కమిటీకి ఎన్నికలను ఆయన నిర్వహించారు. గ్రామ కమిటీ అధక్షుడిగా సోమిరెడ్డి సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎగుర్ల మల్లేశం, యూత్ అధ్యక్షుడిగా బూరుగు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా మెర్గోజు నవీన్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్నికల కార్వనిర్వహణ కమిటీ సభ్యులు ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడురు బాలరాజు, మాజీ ఎంపీటీసీలు వడ్లకొండ శ్రీనివాస్, అనంతుల మల్లేశం, విద్యార్థి నాయకుడు ఆకుల రాజేశ్‌గౌడ్, గ్రామ సర్పంచ్ యేనుగుల దుర్గయ్య, ఎంపీటీసీ యేనుగుల లక్ష్మీనర్సమ్మ, మాజీ సర్పంచ్ దుర్గారెడ్డి, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మద్దూరు: మండలంలోని మర్మాముల, సలాఖపూర్ గ్రామాల్లో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి నేతృత్వంలో టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మర్మాముల గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా కూస రాజు, దండెబోయిన నాగరాజు, యూత్ అధ్యక్ష, కార్యదర్శులుగా కూస బాలచందర్, దండెబోయిన రాజశేఖర్, సలాఖపూర్ గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా బర్రె రామచంద్రారెడ్డి, శెట్టె చిన్న ఐలయ్య, యూత్ అధ్యక్ష, కార్యదర్శులుగా జంగిటి మహేశ్, పత్తి రవి ఎన్నికయ్యారు.
కార్యక్రమంలో , టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మేక సంతోష్‌కుమార్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మంద యాదగిరిల , ఎన్నికల నిర్వాహకులు రాపాక బుచ్చిరెడ్డి, కాసర్ల కనకరాజు, సర్పంచ్‌లు సుందరగిరి స్రవంతి, వంగ బాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు సుందరగిరి పరుశరాములుగౌడ్, సూర్న ఐలయ్య, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్లు పెద్దవూట్ల రాజిరెడ్డి, శెట్టె ఐలయ్య, నాయకులు శీలం చంద్రమౌళి, వేచరేణి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...