చకచకా కొండపోచమ్మ


Fri,August 23, 2019 11:46 PM

-ప్యాకేజీ 14 పనుల్లో వేగం
- అక్కారం, మర్కూక్ పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి
-నెలరోజుల్లో రెండు ప్రాంతాల్లో పంపుసెట్ల బిగింపు
-రోజుకు అర టీఎంసీ నీరు కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోత
-మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ పూర్తికి ముమ్మర చర్యలు
గజ్వేల్, నమస్తే తెలంగాణ : రైతు పవిత్ర దేవాలయం కాళేశ్వరం ఎత్తి పోతల ప్రాజెక్టు పనులు గజ్వేల్‌లో వేగంగా జరుగుతున్నాయి. 2 లక్షల 85వేల ఎకరాలకు సాగునీరు, హైదరాచకచకా కొండపోచమ్మబీడు వారిన భూములకు నీళ్లందించే భగీరథ ప్రయత్నం కాళేశ్వరం ప్రాజెక్టు. మెతుకుసీమను పచ్చగా మార్చేందుకు సీఎం కేసీఆర్ తలపెట్టిన మహాయజ్ఞం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కాగా..గోదావరి పరవళ్లు తొక్కుతున్నది. గజ్వేల్ నియోజకవర్గంలో 2 లక్షల 85 వేల ఎకరాలకు సాగునీళ్లు, హైదరాబాద్‌కు నిత్యం తాగునీటినందించే కొండపోచమ్మ రిజర్వాయర్ పనులు వాయువేగంతో సాగుతున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ పనులు 80 శాతంపైగా పూర్తయ్యాయి. పంపుసెట్లు, మోటర్ల బిగింపు పనులు చివరిదశకు చేరుకుంటున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు ఆలస్యమవుతుండడంతో నేరుగా 18 కిలోమీటర్ల మేర కొండపోచమ్మకు కాలువను తవ్వుతున్నారు. దీని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. గజ్వేల్ మండలం అక్కారం వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌లో 6 పంపుసెట్లు బిగింపు పనులు మొదలయ్యాయి. పంపుహౌస్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా ఇప్పటికే కొన్ని పంపుసెట్లు కూడా వచ్చాయి. మరోవైపు పంప్‌హౌస్ నుంచి పైపులైన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. గజ్వేల్, జగదేవ్‌పూర్‌తోపాటు గౌరారం,మర్కూక్ రోడ్డు క్రాసింగ్ పనులు పూర్తి కావొస్తున్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్‌తోపాటు కాల్వలు, పంప్‌హౌస్‌ల నిర్మాణంలో అత్యాధునిక భారీ యంత్రాలను వాడుతున్నారు. నిత్యం వందలాది కార్మికులు మూడు షిప్టుల్లో పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తుండడంతో రెండునెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాగు నీరందించే, రూ. 1856 కోట్ల వ్యవసాయంతో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. గోదావరి జలాల ఎత్తిపోతల కాలువలు, పైపులైన్లు, పంపుహౌస్‌లు పనులు, విద్యుత్ మోటరు పంపుసెట్ల బిగింపు పనులు రాత్రింబవళ్లు కొనసాగుతున్నాయి. కలల సాధం కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనంత తొందరగా రాష్ట్ర రైతాంగానికి అంకితం చేయాలని, బీడు భూములన్నీ సస్య శ్యామలం కావాలని సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారు. ఆ రోజు త్వరలోనే వస్తుందని వేగంగా కొనసాగుతున్న ప్రాజెక్టు నిర్మిణ పనులు స్పష్టం చేస్తున్నాయి. మల్లన్న సాగర్ నుంచి నేరుగా కొండపోచమ్మకు గోదావరి నీళ్లు తరలించడానికి కాలువల నిర్మాణ పనులు పూర్తి కావస్తుండగా, అక్కారం, మర్కూక్ పంప్‌హౌస్ కూడా పూర్తవుతున్నది. ఇంక పంపుసెట్ల బిగింపు పనులను ముమ్మరం చేయనున్నారు.

సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి, మెదక్ జిల్లాలకు సాగునీటి సౌకర్యం, కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా హైద్రాబాద్ నగరానికి మంచి నీటి సౌకర్యం అందించే కొండపోచమ్మ రిజర్వాయర్ త్వరలో గోదావరి జిలాలతో నిండుకుండలా మారి ఆలల తొనుకులతో కళకళలాడనున్నది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం ఆలస్యం కావడంతో నేరుగా కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటిని తరలించే రెండు కాలువలను నిర్మిస్తున్నారు. ఈ కాలువల నిర్మాణం కూడా 80శాతానికి పైగా పూర్తయ్యింది. తద్వారా నేరుగా గోదావరి నీటిని తరలించడానికి 18కిలో మీటర్ల కాలువ అదనంగా నిర్మిస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 11.500 క్యూసెక్కుల నీరు తరలిస్తారు. 7.9 కిలో మీటర్ వద్ద నుంచి 14వ ప్యాకేజీ ప్రారంభమవుతుంది. గందమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు 4వేల క్యూసెక్కుల నీరు తరలివెళ్లగా, మిగిలిన 7500 క్యూసెక్సుల నీరు అక్కారం పంపుహౌస్‌కు చేరుకుంటుంది.

అక్కారం వద్ద 55 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోత
అక్కారం వద్ద 55 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేందుకు 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు పంపుసెట్లు బిగిస్తున్నారు. అక్కారం పంప్‌హౌస్ నుంచి 4 మీటర్ల డయా కలిగిన ఆరు ఆరు పైపులైన్లు గ్రావిటీ కెనాల్ ప్రారంభం వరకు నిర్మిస్తారు. ఆరు మోటర్ల ద్వారా సెకనుకు 7500 క్యూసెక్కుల నీరు ఆరు పైపులైన్ల ద్వారా గ్రావిటీ కెనాలోకి జారి, అక్కడి నుంచి మర్కూక్ పంప్‌హౌస్‌కు నీరు చేరుతుంది.

మర్కూక్ వద్ద 75 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోత
మర్కూక్ పంప్‌హౌస్‌కు చేరిన నీటిని 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటర్లు 75 మీటర్లు ఎత్తుకు ఎత్తి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి జలాలను చేరుస్తాయి. ఈ పైపులైన్ల ద్వారా జరిగే ఎత్తిపోతలతో రోజుకు (24 గంటలు) 0.5 టీఎంసీ నీరు కొండపోచమ్మ రిజర్వాయరులోకి చేరుతుంది. 15 టీఎంసీల నీరు చేరడానికి నిర్విరామంగా ఎత్తిపోస్తే 30 రోజులు పడుతుంది. అక్కారం పంప్‌హౌస్ నుంచి 2.5కి.మీ. మర్కూక్ పంప్‌హౌస్ నుంచి ఒక కిలో మీటర్‌కు పైగా ఆరు పైపులైన్లు నిర్మిస్తున్నారు.

నెల రోజుల్లో పంప్ సెట్ల బిగింపు
గజ్వేల్ మండలం అక్కారం వద్ద నిర్మించిన పంపు హౌ స్‌లో ఆరు పంపుసెట్లు బిగింపుకు పనులు ప్రారంభం అయ్యా యి. పంపుహౌస్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కాగా, ఇప్పటికే కొన్ని పంపుసెట్లు కూడా వచ్చాయి. మరో వైపు పంపు హౌజ్ నుండి గొట్టాల లైను నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. గజ్వేల్, జగదేవ్‌పూర్‌తో పాటు గౌరారం, మర్కూక్ రోడ్డు క్రాసింగ్ పనులు పూర్తి కావస్తున్నాయి. మర్కూక్ పంప్ హౌజ్‌లో కూడా మోటర్ల బిగింపు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కారం, మర్కూక్ పంపు హౌస్‌ల వద్ద 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ పంపులకు విద్యుత్ సరఫరా కోసమే ప్రత్యేక సబ్‌స్టేషన్లు నిర్మిస్తునారు.

భారీ యంత్రాలు, నూతన సాంకేతికత
కొండపోచమ్మ రిజర్వాయర్‌తో పాటు కాలువలు, పంప్ హౌజ్‌ల నిర్మాణంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు అత్యాధునిక భారీ యంత్రాలను వాడుతున్నారు. అక్కారం, మర్కూక్ పంప్ హౌజ్ నిర్మానంలో జరిగిన పనితనం చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. 4 మీటర్ల డయా ఇనుప గొట్టాల నిర్మాణానికి భారీక్రేన్లు అనేకం కన్పిస్తాయి. రోజు వందలాది మంది కార్మికులు, వాహనాలు పని చేస్తున్నాయి. పంపు సెట్ల బిగింపులో కూడా అధునాతన యంత్ర పనిముట్లను వాడుతున్నారు. పనుల్లో వేగం పెంచి సీఎం కేసీఆర్ సూచన ప్రకారం మరో రెండు నెలల్లో కొండపోచమ్మ రిజర్వాయర్‌కు గోదావరి నీటిని ఎత్తిపోయాలని లక్ష్యంగా పనిచేసున్నారు.
2,85,280 ఎకరాలకు సాగునీరు
కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా సాగు నీరుతో పాటు మంచినీటి సౌకర్యం ఏర్పడుతుంది. గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, మెదక్, భువనగిరి, సంగారెడి,్డ పటాన్‌చెరు, కీసర, శా మీర్‌పేట ప్రాంతాల వివిధ మండలాల గ్రామాలకు చెందిన 2,85,280 ఎకరాలకు సాగునీరు అందుతుంది. భూగర్భజల మట్టం పెరగడంతో పరోక్షంగా ఆయా మండలాల్లో అనేక వేల ఎకరాలకు సాగునీటి సమృద్ధికి అవకాశాలు ఏర్పడుతాయి. ఇక్కడి నుంచే కేశవరం రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...