కార్మిక నేత సిరాజుద్దీన్‌కు అశ్రునివాళి


Fri,August 23, 2019 11:17 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : కమ్యూనిస్టు నేత.. కార్మిక నాయకుడు సిరాజుద్దీన్ మరణం కార్మిక లోకానికి తీరని లోటని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిరాజుద్దీన్ గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డితో కలిసి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. సిరాజుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం సిరాజుద్దీన్ అహర్నిశలు పాటుపడ్డారన్నారు. కార్మిక లోకానికి సిరాజుద్దీన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఆర్‌ఎస్ నాయకుడు బాలకిషన్‌రావు, స్థానిక కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...