నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి


Fri,August 23, 2019 11:16 PM

ములుగు : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని మండల అభివృద్ధి కమిటీ చైర్మన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బట్టు అంజిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం ములుగులో గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించడం గొప్ప విషయమన్నారు. ఎంతో మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలిచి ఆదుకున్నదని అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహాయ సహాకారాలతో అనేక మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందించడం సాధ్యమైందని అన్నారు. ములుగుకు చెందిన చింతకింది సుశీలకు రూ. 2లక్షలు, బ్యాగరి స్రవంతికి రూ. 70వేల, తోడేటి కనకయ్యకు రూ. 65వేలు రూపాయల విలువ చేసే చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు ప్రవీణ్, వార్డు సభ్యులు నగేశ్, శ్రీరాములు, నరేందర్, అనిల్ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...