రైల్వేలైన్ నిర్వాసితులకు ఇండ్లు


Fri,August 23, 2019 11:16 PM

రాయపోల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావడంతోపాటు గృహప్రవేశాలు సైతం కావడంతో దౌల్తాబాద్ మండలం అప్పాయపల్లి గ్రామంలో రైల్వేలైన్ నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వేలైన్‌లో భాగంగా అప్పాయపల్లి గ్రామంలోని 50 ఇండ్లు పోవడంతో రైతులు అందోళన చెందారు. గ్రామస్తులకు ఆసరా ఇవ్వడానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తరుచూ గ్రామంలో పర్యటించారు. రైల్వేలైన్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వ సహకారంతో సంవత్సరం లోపు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో భూములు కోనుగోలు చేసి మొత్తం 50 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లును ఎమ్మెల్యే మంజూరు చేయించారు. దాదాపు రూ.3 కోట్లతో 50 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. మొదటి విడుతలో 25 మందికి డబుల్ బెడ్‌రూం ఇండ్లును నిర్మించి, లబ్ధిదారు లకు అందజేయడంతో అప్పాయపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల గృహ ప్రవేశాలను ఎమ్మెల్యే రామలింగారెడ్డితోపాటు జేసీ పద్మాకర్‌లు పండుగ వాతావరణంలో చేయించారు. గ్రామస్తులు డబుల్ బుడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు పూర్తి సహయసహకారాలు అందించడంతో అనుకున్న సమయానికి ముందే గృహ ప్రవేశాలు పూర్తి చేశారు. మరో 25 ఇండ్ల నిర్మాణాల పనులు యుద్ధ్దప్రతిపాదికన చేస్తున్నారు. నాలుగు నెలల్లో అందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు వస్తుండడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే రామలింగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...