చేర్యాలలో భక్తిశ్రద్ధలతో మహంకాళి బోనాలు


Fri,August 23, 2019 11:14 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : మహంకాళి అమ్మవారికి పట్టణ ప్రజలు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా బండ్లు తిరగడంతో పాటు బోనాలు కార్యక్రమాన్ని ప్రజలు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. బండ్లు, బోనాల సందర్భంగా దేవాలయాన్ని అలయ నిర్వాహుకులు సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయంలోని మహంకాళి, మహాలక్మి, మహా సరస్వతీ అమ్మవార్లకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకుగారి శ్రీదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు మంగోలు చంటి, టౌన్ కార్యదర్శి గోనె హరి, టీఆర్‌ఎస్వీ టౌన్ అధ్యక్షుడు ఒగ్గు శ్రీశైలం, నాయకులు నిమ్మ రాజీవ్‌రెడ్డి, రావుల ఉమేశ్‌గౌడ్, పచ్చిమడ్ల సాయికిరణ్‌గౌడ్, గుడాల శ్రవణ్‌కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...