జోరుగా టీఆర్‌ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు


Fri,August 23, 2019 11:14 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంలో గ్రామ కమిటీల బాధ్యత ఎంతో కీలకమని జడ్పీటీసీ శెట్టె మల్లేశం, ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి మల్లేశం అన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్ గ్రామ కమిటీల ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ సంఘాల బాధ్యులు పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. జడ్పీటీసీ శెట్టె మల్లేశం ఆధ్వర్యంలో కడవేర్గు, చుంచనకోట గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షునిగా పొన్న సిద్ధిలింగం ఎన్నికయ్యారు. చుంచనకోట అధ్యక్షునిగా ఆది రాజు ఎన్నికయ్యా రు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ.నాజర్,మాజీ స ర్పంచ్ బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ తాటికొండ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో రాంపూర్, కాశెగుడిసెలో కమిటీలు ఏర్పాటు చేశారు. రాంపూర్ అధ్యక్షునిగా శెవల్ల కిష్టయ్య, యూత్ అధ్యక్షునిగా బండారి కిష్టయ్య, బీసీ సెల్ అధ్యక్షునిగా బండారి నర్సయ్య ఎన్నికయ్యారు.కాశేగుడిసెల గ్రామ కమిటీ అధ్యక్షునిగా షేక్ ఇమామ్, యూత్ అధ్యక్షునిగా షేఖ్ అఖిల్ ఎన్నికయ్యారు. కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ బొడిగం మహిపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వల్లూరి శ్రీనివాస్, కొంగరి గిరిధర్ పాల్గొన్నారు. బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి మల్లేశం ఆధ్వర్యంలో దొమ్మాట గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షునిగా వంటేల్పుల చంద్రం, యూత్ అధ్యక్షునిగా మంతపురి రవి ఎన్నికయ్యారు. కార్యక్రమంలోఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడూరు బాలరాజు, మాజీ ఎంపీటీసీలు వడ్లకొండ శ్రీనివాస్, అనంతుల మల్లేశం, ఆకుల రాజేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మద్దూరు మండలంలో..
మద్దూరు: మండలంలోని గాగిళ్లాపూర్, జాలపల్లి, కొండాపూర్, తోర్నాల, రేబర్తి గ్రామాల్లో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మేక సంతోశ్‌కుమార్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మంద యాదగిరిల నేతృత్వంలో టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎనున్నకున్నారు. గాగిళ్లాపూర్ గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా చెవిటి మహేశ్, బండి యాదగిరి, యూత్ అధ్యక్ష, కార్యదర్శులుగా బోయిని ప్రశాంత్, బొల్లు కృష్ణ, జాలపల్లి గ్రామ కమిటీ అధ్యక్ష,కార్యదర్శులుగా నాగులపల్లి కుమార్, అంగడి సంపత్‌కుమార్, యూత్ అధ్యక్ష, కార్యదర్శులుగా లంబ రాకేశ్, నర్మెట సాగర్, కొండాపూర్ గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా భీంరెడ్డి బాల్‌రెడ్డి, మంద రాజు, యూత్ అధ్యక్ష, కార్యదర్శులుగా దుడ్డెల విజయ్, మామిడాల సుమన్, తోర్నాల గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా గోనెపల్లి మల్లేశం, పంగ ఎల్లయ్య, యూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా గోనెపల్లి రజినీకాంత్, దుబ్బుడు వంశీకృష్ణారెడ్డి, రేబర్తి గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నలుసాని లింగారెడ్డి, గీకురు మైసయ్య, యూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా నీరటి రమేశ్, కూకట్ల భాను ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్నికల నిర్వాహకులు మాజీ జడ్పీటీసీ నాచగోని పద్మ, బర్మ రాజమల్లయ్య, ఇమ్మడి సంజీవరెడ్డి, గూళ్ల ఆనందం, నలుగొప్పుల రాములు, కర్ర అరుణ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఆకుల యాదగిరి, ఎంపీటీసీ కూరెళ్ల రాజుగౌడ్, సర్పంచ్‌లు బొల్లు కృష్ణవేణి, చొప్పరి వరలక్ష్మి, తాళ్లపల్లి రాజమ్మ, బాదావత్ రేఖ తదితరులు పాల్గొన్నారు.

కొమురవెల్లి లో..
కొమురవెల్లి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాలు, జనగామ నియోజకవర్గ టీఆర్‌ఎస్ కో ఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి సూచనల మేరకు శుక్రవారం మండలంలోని మేజర్ గ్రామం ఐనాపూర్ టీఆర్‌ఎస్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా బూర్గు స్వామిగౌడ్, ఉపాధ్యక్షులుగా జైన నరేశ్, ఆంజనేయులు కార్యదర్శిగా పబ్బోజు కృష్ణ, టీఆర్‌ఎస్ గ్రామ యూత్ అధ్యక్షునిగా వేముల అశోక్‌తో పాటు కార్యవర్గసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సిద్ధప్ప వైస్ ఎంపీపీ రాజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మెరుగు కృష్ణాగౌడ్, మండల ప్రధానకార్యదర్శి వూడెం గోపాల్‌రెడ్డి, కిష్టంపేట సర్పంచ్ బీమనపల్లి కరుణాకర్, టీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మెరుగు నరేశ్‌బాబు, మల్లన్న ఆలయ మాజీ డైరెక్టర్ ముత్యం నర్సింహులుగౌడ్, టీఆర్‌ఎస్వీ మండల సోషల్ మీడియా కన్వినర్ బూర్గు భరత్‌గౌడ్, నాయకులు తలారి కిషన్, జయరాములు, శరత్, శ్రీను, కిషన్, యశ్వంత్ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...