తెలంగాణలో చేనేతకు ప్రోత్సాహం


Fri,August 23, 2019 11:13 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : చేనేత పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని మధ్యప్రదేశ్ రాష్ట్ర జౌళిశాఖ కమిషనర్, మే నేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని చేనేత సహకార పారిశ్రామిక సంఘంలో నేస్తున్న గొల్లభామ చీరలను ఆయన పరిశీలించారు. చీరను నేసె విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవడానికి పర్యటిస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో రాజ్‌మహల్‌సింగ్ అనే రాజు చేనేత వస్ర్తాల పరిరక్షణకు చేసిన కృషిని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జియోట్యాగింగ్ విధా నం అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విధానంతో చేనేతలకు మేలు జరుగుతుందని తెలిపారు. జియోట్యాగింగ్ విధానాన్ని మధ్యప్రదేశ్‌లో ప్రవేశపెట్టనున్నట్లు పే ర్కొన్నారు. తెలంగాణలో నేసిన గొల్లభామ, ఇతర చేనేత వస్ర్తాలను, మధ్యప్రదేశ్‌లో నేసిన మృగనయని చేనేత వస్ర్తాలను తెలంగాణలో ఎగుమతి, దిగుమతి చేసుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ ఇరు రాష్ర్టాల చేనేతలు నేసిన వస్ర్తాలను అమ్మేలా రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. అందులో భాగంగానే తాను చేనేత వస్త్ర పరిశ్రమల ప్రాం తాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. గొల్లభామ చీరల ప్రత్యేకత, తయారు చేయూ విధానం, వాడే నూలు రంగులు, రంగులు అద్దే ప్రక్రియ గురించి ఏడీ వెంకటరమణ వివరించారు. గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్ షోరూం నిర్మాణాన్ని పరిశీలించారు. చేనేతల ప్రోత్సాహం కోసం గోల్కొండ షోరూం నిర్మించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...