26 నుంచి గ్రామ కమిటీ ఎంపిక


Fri,August 23, 2019 11:13 PM

ఈ నెల 26 నుంచి అన్ని మండలల్లో గ్రామ కమిటీల ఎంపిక జరుగుతుందని బాలమల్లు పేర్కొన్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయ కమిటీ సభ్యులు కలిసి కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేయాలన్నారు. పోటీ అధికంగా ఉంటే తన దృష్టికి తేవాలన్నా రు. గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో పట్టణ స్థాయి కమిటీల ఎంపిక ఉండదని, బూత్ కమిటీల ఎం పికే ఉంటుందన్నారు. గ్రామ కమిటీలు పూర్తయిన తర్వా త మండల కమిటీ ఎంపిక చేస్తామన్నారు. కమిటీల ఎం పిక తర్వాత నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని, దీనికి స్థానిక ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్ పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తానని బాలమల్లు తెలిపారు. అంతకు ముందు సీనియర్ నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు పన్యాల భూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. పొలం గట్లపై మొక్క లు నాటి, హరితహారాన్ని విస్తృత పర్చాలన్నారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర సభ్యుడు దేవి రవీందర్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పార్టీ మండల గ్రామస్థాయి అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులు, ముఖ్యకార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. అనంతరం 15 మందితో కూడిన మండల, మున్సిపల్ స్థాయి సమన్వయ కమిటీల ఎంపిక చేశారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...