గజ్వేల్ కార్యకర్తలకు రాష్ట్రస్థాయి గౌరవం


Fri,August 23, 2019 11:12 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ : గజ్వేల్ టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి గౌరవం లభించిందని పార్టీ సభ్యత్వ ప్రత్యేక ఇన్‌చార్జి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం జరిగిన పార్టీ నియోజక వర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. గజ్వేల్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే అన్ని నియోజక వర్గాలకు ఆదర్శంగా నిలిచి మొదటి స్థానాన్ని సొంతం చేసుకుందన్నారు.క్రియాశీల, సాధారణ సభ్యత్వంలో కూడా గజ్వేల్ నియోజకవర్గం ప్రత్యేకతను చాటుకుందన్నారు. నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యమైందని, తద్వారా గజ్వేల్‌కు అరుదైన గౌరవం పార్టీలో లభించిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఈ మైలురాయిని చేరుకోగలిగామన్నారు. సీఎం కేసీఆర్ స్థానిక ప్రజలపై, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారని, స్థానిక నాయకులు కూడా పార్టీకి, ప్రభుత్వానికి వారధిగా నిలువాలని సూచించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. పార్టీ పటిష్టతపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, పనిచేసే కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...