చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి


Fri,August 23, 2019 01:09 AM

సిద్దిపేట టౌన్ : చట్టాన్ని అమలుపరిచే అధికారం రాజ్యాంగం పోలీసులకు ఇచ్చిందని, దానిని పకడ్బందీగా అమలు చేసి నేరస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌పై గురువారం సీపీ జోయల్ డెవిస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నమోదైన ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరి ఉండాలన్నారు. ఏసీపీలు, సీఐలు గ్రేవ్ కేసుల్లో అన్ని కోణాల్లో పరిశోధన చేయాలని తెలిపారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న నేరస్తుల జాబితాను సిద్ధం చేసి పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. నిందితులను అరెస్టు చేసేటప్పు డు గతంలో చేసిన నేరాలను రిమాండ్ రిపోర్టులో నమోదు చేయాలని సూచించారు. ఆస్తి, హత్య కేసుల్లో క్లూస్‌టీమ్ సేవలు వినియోగించుకోవాలన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. పెట్రోలింగ్, బ్లూకోట్స్ సిబ్బంది విధిగా ట్యాబ్‌లు ఉపయోగించాలన్నారు. కేసుల్లో ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్, వీడియో రికార్డింగ్, సీసీ టీవీ కెమెరా, రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్, టెక్నికల్ ఎవిడెన్స్ ఉండే విధంగా పరిశోధన చేయాలని వివరించారు. కేసుల్లో కన్వెన్షన్ రేట్ పెంచడానికి సాక్షాలు చెప్పే సమయంలో బ్రీఫింగ్ ఇవ్వాలని, సంబంధిత ఎస్‌ఐలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏపీపీతో మాట్లాడి కన్వెన్షన్ రేటు పెంచాలని తెలిపారు. పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకుని, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీటు నమోదు చేయాలని సూచించారు. డయ ల్ యువర్ 100పై వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. పిటిషన్లను తప్పకుండా ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని లేకుంటే.. రిసెప్షనిస్టు, ఎస్‌ఐలపై చర్యలు తప్పవని హె చ్చరించారు. కేసు నమోదు చేసే సమయంలో ఫొటో, వీ డియో క్లిప్లింగ్ తప్పకుండా ఉండాలని తెలిపారు. వచ్చే వినాయక చవితి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల ని ఆదేశించారు.మండపాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు పై అవగాహన కల్పించాలని తెలిపారు. సెప్టెంబర్ 30లోపు కమిషనరేట్‌లో వందశాతం సీసీ కెమెరాల బిగింపు ప్రక్రి య ముగిసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నేరాల నియంత్రణకు ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, అప్పుడే నేరాలు తగ్గుముఖం పడుతాయని వివ రించారు. సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టు ద్వారా ప్రతి దరఖాస్తు, ఎఫ్‌ఐఆర్‌లను పార్ట్ -1, 2, రిమాండ్ సీడీ, చార్జ్ షీట్, డిస్పోజల్, ఆన్‌లైన్‌లో రోజువారీగా నమోదు చేయాలని సూచించారు. సబ్‌డివిజన్లలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీలు రామేశ్వర్, నారాయణ, మహేందర్, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, ఇన్‌స్పెక్టర్ దయాకర్‌రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...