పరిశుభ్రత పాటించాలి


Fri,August 23, 2019 01:07 AM

సిద్దిపేట అర్బన్ : ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనదేనని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) సురేశ్‌బాబు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు గురువారం జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో చెత్తాచెదారంతోపాటు వ్యర్థ ్దపదార్థాలను సేకరించి ట్రాక్టర్లలో తరలించారు. జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు.. మాట్లాడుతూ మిట్టపల్ల్లిలో చేపట్టిన చెత్త సేకరణ కార్యక్రమంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఇంటి పక్కన మురుగు గుంట లు ఉండడం..వాటిలో నీరు, చెత్త, వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడంతో ఈగలు, దోమలు చేరడంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. గ్రామాన్ని స్వ చ్ఛంగా ఉంచడానికి ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చాలని సూచించారు. మహిళా సం ఘాలు, ప్రజాప్రతినిధులు పాల్గొని చెత్తను సేకరించి ట్రాక్టర్లలో దూరంగా తరలించారు. స్వచ్ఛత కార్యక్రమం విజయవంతం చేస్తున్న గ్రామస్తులకు స్థానిక సర్పంచ్ వంగ లక్ష్మి, ఎంపీపీ సవితాప్రవీణ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వంగ ప్రవీణ్‌రెడ్డిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీవో సమ్మిరెడ్డి, ఉప సర్పంచ్ సంతోశ్‌యాదవ్, మహిళా సంఘాల నాయకులు, సీఏ లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...