దుబ్బాక రాష్ట్రంలోనే ఆదర్శం


Fri,August 23, 2019 01:06 AM

తొగుట: పేదోల్ల సొంతింటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో దుబ్బాక నియోజకవర్గం తెలంగాణలోనే ముందు వరుసలో నిలిచి ఆదర్శంగా నిలుస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని గోవర్దనగిరిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ గ్రామాన విడతల వారీగా డబుల్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయని, దసరా నాటికి చాలా గ్రామాల్లో ఇండ్లను పేదలకు పంపిణీ చేస్తామన్నారు. పైసా ఆశించకుండా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ తొయేటి ఎల్లం, ఎంపీటీసీ కన్నయ్యగారి కవిత-హరికృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు నంట పరమేశ్వర్‌రెడ్డి, నాయకులు స్వామిరెడ్డి, తిరుపతిరెడ్డి, ఎల్లం తదితరులు ఉన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...