పంట రక్షణ చర్యలు పాటించాలి


Fri,August 23, 2019 01:05 AM

వర్గల్: వానకాలంలో సాగుచేసే మొక్కజొన్న పత్తి, వరి, కంది, తదితర పంట సాగులో మేలైన దిగుబడులు, అధిక రాబడి కోసం రైతులు వ్యవసాయ శాఖాధికారులు అందించే సూచనలు-సలహాలు పాటించాలని ఉమ్మడి జిల్లాల రైతు శిక్షణ కేంద్రం అధికారులు బాబునాయక్ శ్రీకాంత్ తెలియజేశారు. గురువారం వర్గల్ మండలం వేలూరు, తునికిఖల్సాలో పంట తెగుళ్ల నివారణపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు ఏ పంట సాగు ఎంచుకున్న మొదట్లోనే సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలని తెలిపారు. తగిన మోతాదులో ఎరువులు వాడి మొలక దశలో ఆశించే కాండం తొలిచే, ఆకు తొలిచే చీడ-పీడ పురుగుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుత కాలంలో మొక్కజొన్నలో మోగి పురుగు పత్తి సాగులో నీలిరంగు పురుగు వరి సాగులో కాండం తొలిచే పురుగులు ఎక్కువ శాతం ఉన్నందునా రైతులు బెంజోయెట్ ఆయిల్ వేప నూనెను తగిన మోతాదులో పిచికారి చేస్తే పంటను పాడుచేసే పురుగుల నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వర్గల్ వ్యవసాయాధికారి సకలేశ్, విస్తరణ సహాయ అధికారులు సంపత్, లక్ష్మణ్, ధర్మేందర్ సర్పంచ్‌లు పాపిరెడ్డి, సంధ్యారాణి, రైతులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...