ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హరితహారం


Fri,August 23, 2019 01:04 AM

హుస్నాబాద్ రూరల్ : మండలంలోని పందిల్ల గ్రామంలో గురువారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పోచమ్మ కట్ట వద్ద సుమారు వెయ్యి ఖర్జూర మొక్కలను ఎక్సైజ్ శాఖ ఎస్‌ఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నాటారు.
అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు. గీత కార్మికుల సంక్షేమం కోసం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర, తాటి చెట్లను పంపిణీ చేస్తు న్నట్లు తెలిపారు. చెరువు కట్టలపై మొక్కలను నాటడం వల్ల కట్ట దృఢంగా ఉండటంతోపాటు భవిష్యత్‌లో గీత కార్మికులకు జీవనోపాధి లభిస్తుందన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, బంజరు భూముల్లో గీతకార్మికులు వీలైనన్నీ ఎక్కువగా తాటి మొక్కలను నాటాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ తోడేటి రమేశ్, ఎంపీటీసీ బాణాల జయలక్ష్మి, ఉపసర్పంచ్ నెల్లి శ్రీనివాస్, బొమ్మగాని ఎల్లాగౌడ్, పంచాయతీ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...