రెవెన్యూ అధికారుల ఇంటింటి సర్వే


Fri,August 23, 2019 01:02 AM

అక్కన్నపేట : మండలంలోని అక్కన్నపేట, రామవరం, అంతకపేట రెవెన్యూ గ్రామాల్లో డిప్యూటీ తహసీల్దార్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ గోపాల్, ఆర్‌ఐ సురేందర్, వీఆర్వో, వీఆర్‌ఏలు మూడు బృందాలుగా ఆయా గ్రామా ల్లో పర్యటిస్తున్నారు. భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి వివరాలు సేకరించి, స్వయంగా దరఖాస్తులు నింపి తీసుకున్నారు. ప్రధానంగా 1బీ, పహాణీ, తప్పులు, సవరణలు, ఆర్‌ఓఆర్ సమస్యలపైన దరఖాస్తులను స్వీకరించారు. సాంకేతిక పరమైన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్లు ఉన్నారు.

కొనసాగుతున్న ఇంటింటి సర్వే...
హుస్నాబాద్ రూరల్ : భూ సమస్యల పరి ష్కారానికి చేపట్టిన ఇంటింటి సర్వే మండలంలోని మీర్జాపూర్, ఉమ్మాపూర్, మడద, మహ్మదాపూర్ గ్రామాల్లో కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ భూసమస్యలు ఉన్న రైతుల నుంచి వివరాలు సేకరించి స్వయంగా దరఖాస్తులు నింపి తీసుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రత్నాకర్‌రెడ్డి, వీఆర్వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నా

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...