భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం


Fri,August 23, 2019 01:02 AM

కోహెడ : మండలంలోని అన్ని భూ సమస్యలను పరిష్కరిస్తామని తహసీల్దార్ అనిల్‌కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని బస్వాపూర్, శనిగరం గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ సర్వేను పరిశీలించి, కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలో 3900 ఖాతాలు పరిష్కరించాల్సి ఉందన్నారు. శనిగరంలో 814 ఉండగా 209 సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. బస్వాపూర్ లో 411 సమస్యల్లో 45 పరిష్కరించినట్లు వివరించారు. భూమి కొలత సమస్యల పరిష్కారానికి ఆరుగురు సర్వేయర్లను ఆర్డీవో అనంతరెడ్డి పంపిస్తున్నారని చెప్పారు. భూ సమస్యలు పరిష్కరించడానికి ఒక్కో బృందంలో 18మంది సిబ్బంది పని చేస్తున్నట్లు తెలిపారు. 3 నెలలుగా మండలం లో మొత్తం 590 సమస్యలు పరిష్కరించినట్లు, త్వరలో పాస్‌బుక్కులు వస్తాయన్నారు. శనిగరం, బస్వాపూర్ గ్రా మాల్లో రెవెన్యూ సిబ్బంది పెండింగ్‌లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి రైతుల నుంచి పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డులు తీసుకుంటున్నారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ రుక్మిణి, ఆర్‌ఐలు రమ్యశ్రీ, రాజేశ్వరి ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...