అటవీ ప్రాంతాన్ని సందర్శించిన అధికారుల బృందం


Fri,August 23, 2019 01:01 AM

గజ్వేల్‌టౌన్: గజ్వేల్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతాల అభివృద్ధికి అధికారులు చేపడుతున్న సంరక్షణ చర్యలను తెలుసుకునేందుకు గురువారం నారాయణపేట జిల్లా అధికారుల బృందం గజ్వేల్, కోమటిబండ, సింగాయిపల్లి అటవీ ప్రాంతాలను సందర్శించారు. నారాయణపేట ఆర్డీవో శ్రీనివాసులు నేతృత్వంలో సుమారు 30 మంది వరకు అధికారులు పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. గజ్వేల్ అటవీ రేంజ్ అధికారి వెంకటరామారావు అధికారులకు ఇక్కడ అమలు అమలు చేసిన పద్ధతులను అధికారులకు వివరించారు. గజ్వేల్, సింగాయిపల్లి, కోమటిబండల వద్ద ఏఎన్‌ఆర్, ఏఆర్ ప్లాంటేషన్లను చూసి, సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. గజ్వేల్ తరహాలో రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయడంతో గజ్వేల్ పరిధిలోని అటవీ ప్రాంతాలను చూసేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్‌ఆర్‌వో వెంకటరామారావు అధికారుల బృందంకు అటవీ ప్రాంతాలను చూపించడంతో పాటు కోమటిబండ వద్ద మిషన్ భగీరథ పథకం అమలు తీరును వివరించారు. రాష్ట్రంలోనే కోమటిబండ నుంచి మిషన్ భగీరథ పథకం పురుడుపోసుకొని విజయవంతంగా అమలు కావడాన్ని తెలుసుకున్నారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లా అధికారులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...