పిట్టలగూడెం పాఠశాల తనిఖీ


Fri,August 23, 2019 01:00 AM

మద్దూరు: మండలంలోని నర్సాయపల్లి గ్రామ శివారు పిట్టలగూడెం ప్రాథమిక పాఠశాలను గురువారం ఉదయం ఇన్‌చార్జ్ ఎంపీడీవో వి. శ్రీనివాసవర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఉదయం వేళలో పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. పాఠశాల హెచ్‌ఎం పాతిమారాణి విధులకు గైర్హాజరు అయినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎంఈవో దృష్టికి తీసుకెళ్లగా ఎలాంటి అనుమతులు లేకుండా హెచ్‌ఎం విధులకు గైర్హాజరైనట్లు తెలపడంతో హజరు రిజిస్టర్‌లో ఆమెకు సెలవును వేసినట్లు తెలిపారు. దీంతో హెచ్‌ఎం పాతిమారాణికి మెమోను జారీ చేస్తున్నట్లు ఎంఈవో మొగుళ్ల నర్సింహారెడ్డి తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...