సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం


Mon,August 19, 2019 12:15 AM

మిరుదొడ్డి : అణగారిన కులాల విముక్తి కోసం పోరాటం చే సిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని భూంపల్లి గౌడ సంఘం నాయకుడు బొమ్మ ఎల్లాగౌడ్ అన్నారు. ఆదివారం రేణుకా ఎల్లమ్మ దేవాలయ కల్యాణ మండపంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు మహనీయులు చూపిన బాటలో పయనిస్తేనే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నా రు. కార్యక్రమంలో గౌడ సంఘం నేతలు నారాగౌడ్, రాజాగౌడ్, కిషన్ గౌడ్, స్వామి గౌడ్ పాల్గొన్నారు.
తొగుటలో..
తొగుట : మండల కేంద్రంలో ఆదివారం బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు బాలరాజు గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, అఖిల్ గౌడ్ మాట్లాడుతూ మొఘులుల అరాచకత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఘనత పాపన్నగౌడ్‌కే దక్కుతుందన్నారు. పాపన్నగౌడ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని వారు కోరారు. పాపన్నగౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు సుతారి రమేశ్, కుర్మ యాదగిరి, అనిల్, తిరుపతి గౌడ్, సురేశ్‌గౌడ్, స్వామి గౌడ్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...