నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి


Mon,August 19, 2019 12:15 AM

మిరుదొడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గ్రామాల్లో హరితహారం పథకంలో భాగంగా పెడుతున్న మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రజల పై ఎంతైనా ఉందని ఎంపీపీ గజ్జెల సాయిలు అన్నారు. ఆదివారం విలేకరులతో ఎంపీపీ మాట్లాడుతూ నేడు పెడుతున్న ఒక్కొక్క మొక్క భూమిద ఉన్న ఎన్నో జీ వులను సంరక్షిస్తుందన్నారు. ప్రజలు చెట్లను కొట్టడమే ప నిగా పెట్టుకోకుండా మొక్కలను పెంచడం కూడా అలవా టు చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అడవులు అం తరించి పోవడంతోనే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. సమృద్ధిగా వర్షాలు కురువాలంటే ప్రతి ఒక్కరూ 10 మొక్కల చొప్పున పెట్టాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
దౌల్తాబాద్ : వాన కాలం సీజన్‌లో వర్షాలు అధికంగా కురువాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నా టాలని ఎంపీపీ గంగాధరి సంధ్య అ న్నారు. ఆదివారం మండల పరిధిలోని గాజులపల్లిలో రోడ్డుకు ఇరు వైపులా హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాట్టి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆకు పచ్చ తెలంగాణ రాష్ర్టాన్ని నిర్మించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. పసి పిల్లల మాదిరిగా పెట్టిన ప్రతి ఒక్క మొక్కను ప్రజలు కాపాడాలని కోరారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ.అహ్మద్, మాజీ సర్పంచ్ చంద్రం, టీఆర్‌ఎస్ నేతలు పంజ స్వామి, బాల్‌రెడ్డి, దేవిరెడ్డి, ప్రేమ్, దశరథం, నర్సింహులు, భిక్షపతి, ఈజీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...