రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం


Mon,August 19, 2019 12:15 AM

-రెడ్డిపల్లి బైపాస్‌లో బ్రిడ్జి నిర్మించాలనిగ్రామస్తుల ధర్నా, రాస్తారోకో ..
-మూడు గంటల పాటు 44వ జాతీయ రహదారి దిగ్బంధం
-ఎంపీ హామీతో ఆందోళన విరమణ
చేగుంట : రెడ్డిపల్లి బైపాస్ రోడ్డు గ్రామస్తులకు శా పంగా మారింది. మండలంలోని రెడ్డిపల్లి బైపాస్ చౌర స్తా వద్ద రెడ్డిపల్లికి చెందిన కర్రెపల్లి లాలం (60), రెడ్డిపల్లి నుంచి ఆదివారం చేగుంటకు సైకిల్‌పై వస్తూ బైపాస్ రోడ్డు దాటుతున్న సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వా హనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో లాలం అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహం 200 మీటర్ల దూరంలో రోడ్డుపై పడిపోయింది. ఇదే బైపాస్ రోడ్డులో గతంలో గ్రామానికి చెందిన పలువురు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడ్డారు. లాలం మృతి చెం దిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని 44వ జాతీయ రహదారిపై బైఠాయించి 3గంటలకు పైగా ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పినా వినలేదు. రోడ్డు వే సిన జీఎంఆర్ సంస్థ, కేంద్ర ప్రభుత్వంపై గ్రామస్తులు శాపనార్థాలు పెడుతూ.. బ్రిడ్జిని నిర్మిస్తామని హామీ ఇ వ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్‌రావు అక్కడికి చేరుకొని మున్ముం దు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. జీఎంఆర్ అధికారులు వచ్చేవరకు శవాన్ని తీసేది లేదని గ్రామస్తులు భీష్మించారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో ఫొన్‌లో మాట్లాడారు. స్పందించిన ఎమ్మెల్యే, ఎంపీలు జీఎంఆర్ అధికారులతో మాట్లాడారు. రైడ్డిపల్లి బైపాస్ అండర్ బ్రిడ్జి మంజూరు పరిశీలనలో ఉం దని, బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందళన సద్దుమణిగింది. బైపాస్ వద్ద జరిగిన పలు ప్రమాదాల్లో ఇప్పటి వరకు 61 మంది వరకు మృత్యువాత పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. మృతు డి భార్య ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం నిమి త్తం మెదక్ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...