సాహిత్యాన్ని చదివి.. రచనలు చేయాలి


Mon,August 19, 2019 12:14 AM

సిద్దిపేట టౌన్ : కవులు.. సాహిత్యాన్ని బాగా చదువాలని, ఏదో రాశామని కాకుండా మంచి పదబంధాల ఔచిత్యంతో కవిత్వం రాయాలని.. భాషా భావాలను జీవన లక్ష్యాలకు అనుగుణంగా సందేశాలను చెబుతూ పాఠకులను మెప్పించాలని ప్రెస్ అకాడమీ సభ్యుడు కొమురవెల్లి అంజయ్య అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాహిత్యంలో చక్కటి భావాలను ఉన్నాయని, భాషపై మమకారం పెంచుకొని పట్టు సాధించాలన్నారు. విశిష్ట అతిథి నిర్మలాకుమారి మాట్లాడుతూ సిద్దిపేట ప్రాంతం కవులకు, కళాకారులకు నిలయమన్నారు.
రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు అమ్మన చంద్రారెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే కవిత్వం రాయాలని వర్దమాన కవులకు సూచించారు. సిద్దిపేట రచయితల సంఘం ఏర్పాటు చేసిన అనతికాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. కాపు రమేశ్, తుమ్మనపల్లి శ్రీనివాస్, వంగ రామచంద్రారెడ్డి, మిట్టపల్లి పర్శరాములు, పెం దోట వెంకటేశ్వర్లు తదితరులు మా ట్లాడారు. అనంతరం కవులను స న్మానించారు. కార్యక్రమంలో రాజిరెడ్డి, ఎడ్ల లక్ష్మి, పర్శరాములు, లింగం, సురేందర్‌రెడ్డి, వెంకటేశం, రంజిత్‌కుమార్, మహేందర్‌రెడ్డి, సుధాకర్, మహమూద్‌పాషా, ము రళి, బాలరాజం పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...