విద్యుత్ సమస్యలపై నివేదిక ఇవ్వాలి


Sat,August 17, 2019 10:48 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : అన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి నిర్వహిస్తున్న విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా గ్రామాల వారీగా సర్వే నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో డీఈ రామచంద్రయ్య తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హుస్నాబాద్ డివిజన్‌లోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు తమ గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై నివేదికలు తయారు చేసి ఈ నెల 21న హుస్నాబాద్ డీఈ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

గ్రామాల్లో ప్రధానంగా లూజువైర్లు, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలు, అదనపు స్తంభాలు తదితర సమస్యలను నివేదికలో తెలియజేయాలన్నారు. 33, 11 కేవీల ఎల్‌టీ లైన్లకు సంబంధించిన అన్ని సమస్యలతో కూడిన జాబితాను గ్రా మాలవారీగా ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపిస్తే నిధులు వస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో వందశాతం విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...