సకల హంగులతో ఠాణాలు..


Sat,August 17, 2019 10:48 PM

కొత్తగా రూపుదిద్దుకుంటున్న గజ్వేల్, కుకునూర్‌పల్లి స్టేషన్లలో సకల హంగులతో అన్ని సౌకర్యాలు కల్పించేలా నిర్మాణాలు చేపడుతున్నారు. గజ్వేల్ స్టేషన్ పరిధిలోని ఆ యా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు కూర్చునేలా విశాలమైన గదిని నిర్మిస్తున్నారు. ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేకంగా కానిస్టేబుల్ అందుబాటులో ఉంచుతారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే మహిళల కోసం ప్రత్యేక గది అందుబాటులో ఉండేలా ప్రణాళికను రూపొందించారు. ఇందులోనే స్టేషన్ ఎస్‌హెచ్‌వోల కోసం గదులను పూర్తిగా అద్దాలతో నిర్మించనున్నారు. దీనికి ముందు కంప్యూటర్ విభాగం, పక్కన సీఐ విశ్రాంతి గదిని నిర్మిస్తున్నారు. గజ్వేల్ స్టేషన్‌లో విధులు నిర్వహించే ఇద్దరు ఎస్‌ఐలకు వేర్వేరుగా రెండు గదులు, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు రికార్డులను భద్రపరిచేందకు, కేసులకు సంబంధించిన వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసేందుకు గదులను వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా నేరస్తులను లాకప్‌లో ఉంచేందుకు మరో గదిని అందులోనే అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

పనులను పరిశీలించిన సీపీ జోయల్ డెవిస్
గత నెల 17న పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ గజ్వేల్ పోలీస్ స్టేషన్ మరమ్మతు పనులను పరిశీలించారు. అత్యాధునిక హంగులతో రూపురేఖలు మార్చుతున్న స్టేషన్ పనులను పరిశీలించి, త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు చేయాలని సూచించారు. గజ్వేల్, కుకునూర్‌పల్లి స్టేషన్‌లలో పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు మేరుగైన సేవలు అందనున్నాయి.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...