ఠాణాలకు కొత్త రూపు


Sat,August 17, 2019 10:47 PM

గజ్వేల్ టౌన్ : జిల్లాలో కార్పొరేట్ స్థాయిలో పోలీస్ స్టేషన్‌లను నిర్మించాలనే ఆలోచనతో ఉన్నతాధికారులు ముం దుగా జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. 14 పోలీస్‌స్టేషన్లపై ఉన్నతాధికారులు నివేదిక పంపించగా, ప్రభుత్వ అనుమతుల కోసం వేచి ఉన్నారు. సైబరాబాద్ పరిధిలోని స్టేషన్ల మాదిరిగా కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఒక్కొక్క స్టేషన్‌కు రూ.15 లక్షల వరకు మంజూరు చేసింది. ప్రజలకు సౌకర్యవంతమైన సేవ లు అందించేందుకు నిధులు వెచ్చించనున్నారు. ప్రస్తుతం గజ్వేల్, కుకునూర్‌పల్లిలో భవనాల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత గోడలకు ఆకర్షనీయమైన రంగులు వేసి, భవనం చుట్టూ అద్దాలతో అలంకరించే పనులు చేపడతారు. పనులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...