మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు


Sat,August 17, 2019 10:47 PM

సిద్దిపేటలో నాటిన ప్రతి మొక్కను కాపాడాలనే లక్ష్యంతో మున్సిపాలిటీ హర్టికల్చర్ అధికారి ఐలయ్య ఆధ్వర్యంలో 23 మంది సిబ్బంది మొక్కల సంరక్షణ కోసం పనిచేస్తున్నారు. మొక్క ఎండిపోయినా.. విరిగినా వెంటనే కొత్త మొక్కను నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో మొక్కల సంరక్షణకు 14 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పాత బస్టాండ్, కరీంనగర్, హైదరాబాద్ రోడ్లలో డివైడర్లపై నాటిన మొక్కలకు డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. దీని ఫలితంగా పట్టణంలోని మెదక్, కరీంనగర్, హైదరాబాద్, హుస్నాబాద్, రూరల్ పోలీస్‌స్టేషన్ రహదారుల్లో నాటిన మొక్కలు, వైకుంఠధామాలు, స్మృతివనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆకుపచ్చని వనంగా మారాయి. మొక్కల సంరక్షణ కోసం ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...