జీవిత బీమాతో భవిష్యత్‌పై ధీమా


Sat,August 17, 2019 10:46 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : జీవిత బీమా ప్రతి ఒక్కరికీ అవసరమని, దీనిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సూచించారు. హుస్నాబాద్‌లోని గాయత్రి బ్యాంకు ఖాతాదారుడు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు వచ్చింది. శనివారం బ్యాంకులో జరిగిన సమావేశంలో చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుటుంబ యజమాని మృత్యువాత పడితే ఆ కుటుంబం ఎన్నో ఇ బ్బందులకు గురికావాల్సి వస్తుందని, జీవిత బీమా చేసుకోవడం ద్వారా కుటుంబానికి భవిష్యత్‌పై ధీమా కల్పించాలన్నారు. మూడేండ్లుగా గాయత్రి బ్యాంకు వారు హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్నారని, రాబోయే రో జుల్లోనూ బ్యాంకు సేవలను విస్తరించి ప్రజలకు చేరువ కావాలని అన్నారు.

ఖాతాదారులకు బీమా చేయించడం అభినందనీయమన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ లకావత్ మానస, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, బ్యాంకు మేనేజర్ జన్ను భిక్షపతి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రాంరెడ్డి, నాయకులు దొడ్ల శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం మోహన్, రాజిరెడ్డి, రాజగోపాల్‌రావు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...