ఇంటి ముంగిట్లోకి రెవెన్యూ సేవలు


Sat,August 17, 2019 10:44 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : భూయజమానులు.. ఇకపై రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటి ముంగిట్లోకే రెవెన్యూ సేవలను తేవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. శనివారం హుస్నాబాద్ మండల పరిషత్‌లో డివిజన్‌లోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మ ద్దూరు మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రెండు రోజుల్లో మండలాల వారీగా అధికార బృందాల జాబితాను సోమవారం ఆర్డీవో కార్యాలయానికి షెడ్యూలు పంపాలన్నారు. 20వ తేదీ నుంచి రెవెన్యూ అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్ప డి గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. గ్రామాల్లో ఏయే సమస్యలు ఉన్నాయో? గుర్తించి, జాబితా తయారు చేసుకోవాలని, ఆ జాబితా ప్రకారం భూయజమానుల ఇంటి వద్దకే వెళ్లి విచారణ జరిపి అవసరమైతే అక్కడికక్కడే సమస్యను పరిష్కరించాలని ఆదే శించారు.

ప్రతి మండలానికి 3 నుంచి 4 బృందాలను ఏర్పాటు చేసుకోవాల ని, ఒక్కో అధికారుల బృందం కనీసం మూడు గ్రామాల్లో పర్యటించాలన్నా రు. ఒక్కో గ్రామంలో సమస్యల తీవ్రతను బట్టి 3, 4 రోజులు కేటాయించాలన్నారు. భూసమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు భూయజమాని వద్దకు వెళ్లి విచారణ జరుపాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు దశరథ్‌సింగ్,రాథోడ్, అనిల్‌కుమార్, హరిబాబు, గైసున్నీసాబేగం, డీటీ రమేశ్, గిర్దావర్ రత్నాకర్‌రెడ్డి, ఆర్‌ఐలు, వీఆర్వోలు పాల్గొన్నారు.

మల్‌చెర్వుతండాలో రెవెన్యూ సదస్సు...
అక్కన్నపేట : మండలంలోని మల్‌చెర్వుతండాలో రెవె న్యూ అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్‌చెర్వుతండాతోపాటు దుబ్బాతండా, నర్సింగ్‌తండా నుంచి పెద్ద సంఖ్యలో గిరిజన వచ్చారు. తమ భూ సమస్యలను పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరించగా, కొ న్నింటిని క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరిస్తామన్నా రు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ తిరుపతిరెడ్డి, ఆర్‌ఐ సురేందర్, సర్పంచ్ మల్లేశం, ఉపసర్పంచ్ ఉన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...