మైనార్టీ బాలికల పాఠశాలలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ


Fri,August 16, 2019 11:02 PM

సిద్దిపేట అర్బన్ : పట్టణంలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మైనార్టీలు (ముస్లింలు) నుంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపాల్ కె.లింగం తెలిపారు. శుక్రవారం ఆయన పాఠశాలలో మాట్లాడుతూ.. 5వ తరగతిలో 27 ఖాళీలు, 6వ తరగతిలో 5 సీట్లు, 7వ తరగతిలో 14, 8వ తరగతిలో 21, 9వ తరగతిలో 21 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆయా తరగతుల్లోని సీట్లను భర్తీ చేసేందుకు కేవలం ముస్లిం పిల్లల నుంచే దరఖాస్తులను స్వీకరిస్తు న్న ట్లు పేర్కొన్నారు. అలాగే, 5వ తరగతిలో 1, 9వ తరగతిలో 1.. మొత్తం రెండు సీట్లు క్రిష్టియన్‌న్లకు ఖాళీలు ఉన్నాయని, వాటికి క్రిష్టియన్ల దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 7995 057923, 9581531655 ఫోన్ నెంబర్లలో సం ప్రదించాలని ప్రిన్సిపాల్ లింగం సూచించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...