జయహే.. జయహే


Thu,August 15, 2019 10:50 PM

-ఘనంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవం
-ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
-వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాళ్ల ప్రదర్శన
-ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసాపత్రాల అందజేత కార్యక్రమాలు, వివిధ శాఖల శకటాలు, స్టాళ్ల ప్రదర్శనను వారు

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీమంత్రి, సిద్దిపేట శాసన సభ్యుడు తన్నీరు హరీశ్‌రావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, హుస్నాబాద్ శాసన సభ్యుడు వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ పద్మాకర్, పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్‌లతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక
తిలకించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన 62 మందికి అవార్డులు ప్రదానంచేశారు. శకటాల ప్రదర్శనలో వైద్య ఆరోగ్య శాఖ శకటానికి ప్రథమ, వ్యవసాయ శాఖకు ద్వితీయ, డబుల్ బెడ్రూం శకటానికి తృతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు శకటానికి నాలుగవ బహుమతులు అందజేశారు. స్టాళ్ల ప్రదర్శనలోను వైద్య ఆరోగ్య శాఖకు ప్రథమ, ఇరిగేషన్ స్టాల్‌కు ద్వితీయ, పోలీసు శాఖకు తృతీయ బహుమతి లభించాయి. స్వాతంత్య్ర సమరయోధులు శానంగారి రత్నమ్మ, పురమాండ్ల అన్నమ్మ, కొండ చిన్నమల్లయ్య, వెంకట్రామ్‌రెడ్డిలను ఘనంగా సన్మానించారు. సాంస్కృతిక విభాగంలో ప్రథమ బహుమతి చైతన్య హైస్కూల్, ద్వితీయ బహుమతి లచ్చపేట స్కూల్, తృతీయ బహుమతి మెరిడియన్ పాఠశాలలకు లభించాయి.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...