ఉత్తమ సేవకు ప్రశంస


Thu,August 15, 2019 10:46 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 62మందికి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించు కొని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశంసాపత్రా లు అందజేశారు. ఆర్‌అండ్‌బీ అధికారి సుదర్శన్‌రెడ్డి, డీపీవో సురేశ్‌బాబు, డీఎంహెచ్‌వో అమర్‌సింగ్, పీవోఎంహెచ్‌ఎన్ కాశీనాథ్, డీఈఆర్‌అండ్‌బీ రామకృష్ణకు జిల్లా అధికారుల విభాగంలో ప్రశంసాపత్రాలు, రెవెన్యూ విభాగంలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, విజయేందర్‌రెడ్డి, అనంతరెడ్డి, గజ్వేల్, హుస్నాబాద్, తొగుట తహసీల్దార్లు శ్రీనివాస్, దశరథ్‌సింగ్ రాథోడ్, వీర్‌సింగ్, ములుగు నయాబ్ తహసీల్దార్ వెంకటనర్సింహారెడ్డి, గజ్వేల్ ఆర్డీవో ఆఫీ సు సీనియర్ అసిస్టెంట్ పద్మ, కొండపాక ఎమ్మార్వో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రాజు, హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయ హెచ్‌హెచ్‌పీ రంజిత్‌కుమార్, వీఆర్‌వో జ్యోతి, వీఆర్‌ఏ మహేందర్, కాశీకి ప్రశంసాపత్రాలు ఇచ్చారు. పోలీసు విభాగంలో హెడ్‌కానిస్టేబుల్ మహమూద్‌అలీ, కానిస్టేబుళ్లు అశోక్, పూర్ణవిష్ణు, డి.శ్రీనివాస్, ఎం.శ్రావణ్‌కుమార్, ఎస్. నవీన్, ఏ. సురేశ్, డీ. అనిల్‌కుమార్, జీ. స్వామి, ఏ. సంజీవరెడ్డి, ఎం యాదగిరి, కళాబృందం నుంచి బాల్‌నర్సుకు, జిల్లా పరిషత్ విభాగంలో ములుగు ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, పంచాయతీ రాజ్ విభాగంలో వర్గల్ ఈవోపీఆర్‌డీ మేరి సువర్ణాకుమారి, జగదేవ్‌పూర్ ఈవోపీఆర్‌డీ రాంరెడ్డి, సెర్ప్ విభాగంలో ఎల్లారెడ్డిపేట వీవో ప్రెసిడెంట్ ఎల్లవ్వ, బ్యాంకింగ్ విభాగంలో సిద్దిపేట ఎస్‌బీఐ ఏడీబీ మేనేజర్ లలిత, ఆంధ్రాబ్యాంకు శిక్షణా విభాగం డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీఏ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ సునిత, వ్యవసాయ శాఖ నుంచి ములుగు ఏవో ప్రగతి, బక్రీచెప్యాల ఏఈవో రాజేశ్‌యాదవ్, హార్టికల్చర్ విభాగంలో సిద్దిపేట హార్టికల్చర్ ఆఫీసర్ రవికాంత్, సంక్షేమ శాఖలో ఐసీడీఎస్ హుస్నాబాద్ జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, మున్సిపల్‌లో సిద్దిపేట మున్సిపల్ టీవో రవీణ, విద్యా విభాగంలో డీఈవో ఆఫీసు అసిస్టెంట్ డైరెక్టర్ మార్క వెంకటలకా్ష్మగౌడ్, డీఈవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మధుసూదన్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖలో భూంపల్లి మెడికల్ ఆఫీసర్ మల్లికార్జున్, వట్‌పల్లి స్టాఫ్‌నర్సు స్వాతి, ఎంపీహెచ్‌ఎస్ కె.చక్రధర్, ఎస్‌సీ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్, అటవీ శాఖలో కొండపాక సెక్షన్ ఆఫీసర్ సాయిరామ్, టీఏ అప్పారావు, నీటి పారుదల శాఖ విభాగంలో డిప్యూటీ ఈఈ డి.పవన్‌కుమార్, కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్ 1 ఏఈఈలు చంద్రశేఖర్, ఇ.శ్రీనివాస్, కొండపోచమ్మ డీఈఈ మోతియ, ఎక్సైజ్ శాఖ హెడ్‌కానిస్టేబుల్ రాములు, ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌గౌడ్‌లకు ప్రశంసాపత్రాలు అందించారు. అలాగే, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ ప్రాజెక్టులో సోలార్ ప్యాడీ హార్వేస్టర్‌ను తయారు చేసిన జడ్పీహెచ్‌ఎస్ అంతక్కపేట విద్యార్థి అరుణ్‌కుమార్‌కు, బోరువెల్ రెస్క్య్‌మిషన్ ఇన్నోవెట్ చేసిన స్పైస్ మోడల్ స్కూల్ విద్యార్థి చందన్ బృందానికి, బహుళ ఉపయోగాలు గల రసాయన పదార్థాల స్పేయర్, విత్తన మిషన్లు తయారు చేసిన జడ్పీహెచ్‌ఎస్ అంతక్కపేట విద్యార్థుల బృందం, మైక్రో కంట్రోలర్ బేస్డ్ ఆటోమెటిక్ ఇంజిన్ లాకింగ్ సిస్టం ఫర్ డ్రంక్ డ్రైవర్స్ ఇన్నోవేట్ చేసిన ఇందూరు కళాశాల విద్యార్థిని సుశ్మస్వరాజ్ బృందం, మినీ పవర్ ట్రిల్లర్ మిషన్‌ను ఇన్నోవేట్ చేసిన ఇందూర్ కళాశాల విద్యార్థి చందు అండ్ టీంకు, ప్లాంట్ విడ్ రిమూవర్ తయారు చేసిన రూరల్ మండలంలోని రాఘవాపూర్‌కు చెందిన రైతు బాలకృష్ణారెడ్డికి ప్రశంసాపత్రాలు ఇచ్చారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...