సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ


Thu,August 15, 2019 10:43 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ వేడుకలు డివిజన్‌లోని అన్ని గ్రామాల్లో గురువారం ఘనంగా జరిగాయి. నువ్వు నాకు రక్ష...నేను నీకు రక్ష అంటూ అన్నతమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు ఇచ్చిప్పుచ్చుకున్నారు. హుస్నాబాద్ పట్టణంతో పాటు డివిజన్‌లోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో రాఖీ పండుగ ఆనందోత్సాహాల మధ్య జరిగింది. పండుగ సందర్బంగా హుస్నాబాద్ పట్టణంతో పాటు ఆయా మండల కేంద్రాల్లో సందడి నెలకొంది. ముఖ్యంగా బస్టాండ్లలో రద్దీ పెరిగింది. గురువారం సాయంత్రం వరకు కూడా బస్సులు కిక్కిరిసిపోయాయి.

పట్టణంలోని దుకాణాలు సైతం కొనుగోళ్లతో కిటకిటలాడాయి. రాఖీలు కట్టి సోదరీమణులకు స్వీట్లు తినిపించడంతో పాటు కొత్తబట్టలు పెట్టి సాగనంపారు. అలాగే పలు పాఠశాలలు, కళాశాలల్లోనూ రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ యొక్క ప్రాధాన్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఒకవైపు స్వాతంత్య్ర దినోత్సవం, మరోవైపు రాఖీ పండుగ రెండు ఒకే రోజు కావడంతో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అంతటా పండుగ వాతావరణం నెలకొంది.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...