గ్రామాల్లో ఘనంగా తీజ్


Thu,August 15, 2019 10:42 PM

అక్కన్నపేట: మండలంలోని పంతుల్‌తండాతోపాటు దుబ్బతండా గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గిరిజన తండాల్లో గురువారం తీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంతుల్‌తండాలో జరిగిన తీజ్ ఉత్సావాల్లో ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ పాల్గొన్నారు. అలాగే పంతుల్‌తండా గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఐదో విడుత హరితహారం కింద మొక్కలు నాటారు. అనంతరం ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలునాయక్ దంపతులతో పాటు జడ్పీటీసీ మంగను గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో పంతుల్‌తండా సర్పంచ్ భూక్య ఆశ్వినికుమారిహేమనాయక్, ఎంపీటీసీ పెసరు సాంబరాజు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...