ఘనంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవం


Thu,August 15, 2019 10:42 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ/రూరల్/టౌన్/అక్కన్నపేట/కోహెడ/బెజ్జంకి: హుస్నాబాద్ పట్టణంతో పాటు డివిజన్‌లోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ర్యాలీలు, ఆటపాటలతో అలరింపజేశారు.

హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో అనంతరెడ్డి, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మహేందర్, మున్సిఫ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి గూడ అనూష, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజమల్లయ్య, టీఆర్‌ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి జెండావిష్కరణ చేశారు. అలాగే ఆయా మండల పరిషత్‌లతో ఎంపీపీలు, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జెండావిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా వందనం అనంతరం విద్యార్థులకు స్వీట్లు, బహుమతులు అందజేశారు. ఊరేగింపుల్లో విద్యార్థుల కోలాటం ఆటలు, వివిధ వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...