జెండా పండుగకు వేళాయె


Wed,August 14, 2019 11:15 PM

-జాతీయ జెండా ఆవిష్కరించనున్న శాసన సభ స్పీకర్ పోచారం
-స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
-ప్రభుత్వ పథకాలపై శకటాల ప్రదర్శన
-విశిష్ట సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం సిద్ధమైంది. పరేడ్ గ్రౌండ్, వేదిక తదితర ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా సకల ఏర్పాట్లు చేయాలని జేసీ పద్మాకర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేకంగా షామీయానాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. పోలీసులు పరేడ్ నిర్వహించేలా మైదానాన్ని సిద్ధం చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండావందనం చేస్తారు. అనంతరం 10.15 గంటల నుంచి 10.30 గంటల వరకు జిల్లా ప్రజలను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతారు.

10.30 నుంచి 10.45 గంటల వరకు స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానిస్తారు. 10.45 నుంచి 11.20 గంటల వరకు ఆయా విద్యాసంస్థల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 11.20 నుంచి 11.45 గంటల వరకు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి అవార్డులు, ప్రశంసా పత్రాలు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అందజేస్తారు. 11.45 నుంచి 12 గంటల వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలపై శకటాల ప్రదర్శనను తిలకించి స్టాళ్లను పరిశీలించనున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన జేసీ పద్మాకర్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను జేసీ పద్మాకర్, ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఆర్‌వో చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, విద్యుత్ ఎస్‌ఈ కరుణాకర్‌బాబు, మున్సిపల్ డీఈ లక్ష్మణ్, పీఆర్‌డీఈ వేణుగోపాల్, అర్బన్ తహసీల్దార్ విజయ్‌సాగర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పోలీసు పరేడ్ వద్ద పారిశుధ్య సమస్యలు లేకుండా ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా శకటాలు తిప్పే ప్రదేశాలు, వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ప్రదేశం తదితర వాటిని పరిశీలించారు. ఈ వేడుకల్లో 15 స్టాల్స్, 12 శకటాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

వీటిలో వ్యవసాయ, హార్టికల్చర్, డీఆర్‌డీవో, పోలీసు శాఖ, ఫారెస్టు, మున్సిపాలిటీ, మెప్మా, వైద్య ఆరోగ్యం, టెక్స్‌టైల్స్, సైన్స్‌టెక్నాలజీ, చేనేత, హ్యాండ్లూమ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు డిస్‌ప్లే, మత్స్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఫిషరీస్, ఇరిగేషన్, సంక్షేమ శాఖలు, లీగల్ మెట్రాలజీ, మార్కెటింగ్, సివిల్ సైప్లె, బ్యాంకర్స్ తదితర స్టాల్స్‌తో పాటు వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, హార్టికల్చర్ అండ్ మార్కెటింగ్, డీఆర్‌డీవో, పోలీసు, మెప్మా, అటవీ శాఖ, వైద్య ఆరోగ్యం, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, నీటి పారుదల శాఖ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్‌బీఐ శకటాలను ప్రదర్శించనున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...