మల్లన్న సాగర్ కేసులో..హైకోర్టు స్టే


Wed,August 14, 2019 10:50 PM

16 నుంచి 22 వరకు ఎడ్‌సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సిద్దిపేట టౌన్ : సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఈ నెల 16 నుంచి 22 వరకు ఎడ్‌సెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నామని కళాశాల ప్రిన్సిపాల్, ఎడ్‌సెట్ హెల్ప్‌లైన్ సెంటర్ కన్వీనర్ గన్న బాలకిషన్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16న ఇంగ్లిష్ అభ్యర్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వెరిఫికేషన్ ఉంటుందన్నారు. 1 గంట నుంచి ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు వెరిఫికేషన్ ప్రారంభమవుతుందన్నారు. 17న మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు ఉదయం 9 గంటల నుంచి 1వ ర్యాంక్ నుంచి 3 వేల ర్యాంకు వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 3001వ ర్యాంక్ నుంచి 6 వేల వరకు వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. 18న ఉదయం 9 గంటల నుంచి 6001 నుంచి 9 వేల ర్యాంకు వరక్, మధ్యాహ్నం 1 గంట నుంచి 9001 నుంచి చివరి వరకు వెరిఫికేషన్ ఉంటుందన్నారు. 19న ఉదయం 9 గంటల నుంచి బయాలజీ అభ్యర్థులకు 3 వేల ర్యాంక్ వరకు, మధ్యాహ్నం 6 వేల ర్యాంక్ వరకు వెరిఫికేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు.

20న బయాలజీ అభ్యర్థులకు ఉదయం 9 గంటల నుంచి 6001వ నుంచి 9 వేల ర్యాంక్ వరకు జరుగుతుందన్నారు. 21న సోషల్ అభ్యర్థులకు ఉదయం 9 గంటల నుంచి 4 వేల ర్యాంకు వరక్, మధ్యాహ్నం 1 గంట నుంచి 8 వేల ర్యాంక్ వరకు వెరిఫికేషన్ ఉంటుందన్నారు. 22న ఉదయం 9 గంటల నుంచి సోషల్ అభ్యర్థులకు యథావిధిగా 8 వేల ర్యాంక్, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 12 వేల ర్యాంక్ వరకు విద్యార్థినుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం నుంచి చివరి ర్యాంక్ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుపనున్నామని తెలిపారు. వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్లను తెచ్చుకోవాలన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...