పరిశుభ్రతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు


Wed,August 14, 2019 10:50 PM

హుస్నాబాద్‌టౌన్ : ఇంటి పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ఇందుకోసం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలలో స్వచ్ఛ భారత్‌పై నెహ్రూ యువకేంద్రం వారి ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌కోసం తాము సైతం కృషి చేస్తామంటూ విద్యార్థుల చేత నెహ్రూ యువ కేంద్రం హుస్నాబాద్ బ్లాక్ వలంటీర్ బత్తుల శంకర్‌బాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలకు పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థులు హాజరైనట్లు శంకర్‌బాబు తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...