కేశవాపూర్‌లో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు


Wed,August 14, 2019 10:49 PM

అక్కన్నపేట : మండలంలోని కేశవాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం ఐదో విడుత హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను కూడా పంచుకున్నారు. నాటిన మొక్కలకు మహానీయుల పేర్లు పెట్టి విద్యార్థులు దత్తత తీసుకునేలా ప్రోత్సహించారు. పాఠశాల ఆవరణలో పండ్లు, పూలు, ఔషధ మొక్కలతో పాటు నీడనిచ్చే వివిధ రకాల సుమారు 100 మొక్కల వరకు నాటారు. అలాగే మొక్కలకు రాఖీలు కట్టి వృక్షాబంధన్ చేపట్టారు. అంతకుముందు పాఠశాలలోని బాలికలతో బాలురకు రాఖీలు కట్టి రక్షబంధన్ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మగాని రాజేశం, పాఠశాల ఉపాధ్యాయులు జె. సత్యనారాయణ, సమ్మయ్య, రాజ్‌మహ్మద్, దామోదర్, శంకరయ్య, శ్రీలత, నర్సింహాస్వామి తదితరులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...