వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం


Wed,August 14, 2019 10:49 PM

బెజ్జంకి : మండలంలోని రేగులపల్లిలో బాలవికాస సహకారంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెనె ప్రైవేట్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని ఎంపీపీ లింగాల నిర్మల పేర్కొన్నారు. రేగులపల్లిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జడ్పీటీసీ కనగండ్ల కవితతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామస్తులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య శిబిరంలో 285 మందికి పరీక్షలు చేసి మందులను అందించారు.

అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రెండు జతల దుస్తులను ఎంపీపీ, జడ్పీటీసీ విద్యార్థులకు అందించారు. ఎంపీపీ చీలాపూర్‌పల్లిలో రోడ్డును పరిశీలించి, మరమ్మతుల కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ జెల్ల ఐలయ్య, ఎంపీటీసీ దుంబాల రాజమహేందర్‌రెడ్డి, ఏఎస్‌ఐ హన్మంతరావు, వైద్యులు జయంత్, రవళి, ఉపసర్పంచ్ సంతోశ్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, సంస్థ సభ్యులు రాజమౌళి, తిరుపతి, జితేందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...