సిద్దిపేటలో రాఖీ సందడి


Wed,August 14, 2019 12:07 AM

సిద్దిపేట టౌన్ : అన్నాచెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ సందడి రెండు రోజుల ముందుగానే జిల్లా కేంద్రం సిద్దిపేటలో షురువైంది. అనుబంధాల ఆప్యాయతలకు, దర్పానికి ఈ పండుగ నిలుస్తుంది. పండుగ రోజున ప్రేమ ఆప్యాయతలకు, అనుబంధాలకు గుర్తుగా రాఖీలు కట్టుకుంటారు. అంతటి ప్రసిద్ధి చెందిన పండుగ వేళ పట్టణంలో రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి. ప్రజలను ఆకర్శించేందుకు వ్యాపారులు వివిధ ఆకృతుల్లో రాఖీలను అహ్మదాబాద్, కోల్‌కత్తా, ఢిల్లీ, రాజ్‌కోట్ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. రూపాయి నుంచి మొదలుకొని రూ.5 వేల బంగారు రాఖీని విక్రయదారులు అందుబాటులో ఉంచారు.

ఊపందుకున్న రాఖీ అమ్మకాలు..
రాఖీ పండుగ సమీపించడంతో సిద్దిపేట పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు రాఖీలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. అందుకనుగుణంగా వ్యాపారులు సుమారు 200 రాఖీ సెంటర్లను సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. వివిధ ఆకృతుల్లో... డిజైన్లలో రాఖీలను కొనుగోలుదారుల మదిని దోచుకునేలా అందుబాటులో ఉంచారు. స్టోన్స్ పొందుపర్చిన రాఖీలు, చిన్నారులకు చోటాభీమ్, మోటుపట్లు, స్పైడర్‌మాన్ రాఖీలు, గడియారపు నమూనాతో పాటు 7 వేల రకాల రాఖీలను విక్రయానికి పెట్టారు.

రూపాయి నుంచి మొదలు..
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీలు కట్టుకుంటారు. అందుకనుగుణంగానే పట్టణ వ్యాపారులు రూపాయి నుంచి మొదలుకొని రూ.5 వేల విలువ చేసే బంగారు పూత, స్టోన్స్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన రాఖీలను తీసుకువచ్చారు. ప్రత్యేకంగా రూ.5 వేల రాఖీని ఈ ఏడాది పట్టణంలో విక్రయించడం మొదటిసారి. రాఖీతో పాటు ఐఎస్‌ఐ మార్కుతో కూడిన కార్డును పొందుపర్చారు. అదే విధంగా పర్యావరణ పరిరక్షణ కోసం పూర్తిగా నూలు, దూదితో కలిపి తయారు చేసిన రాఖీలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...