ఇంటింటికీ హరితహారం మొక్కల పంపిణీ


Wed,August 14, 2019 12:06 AM

గజ్వేల్‌రూరల్ : కోమటిబండ గ్రామంలో హరితహారంలో భాగంగా గ్రామస్తులకు సర్పంచ్ తూంశేఖర్‌పటేల్ మంగళవారం మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి గ్రామాన్ని హరితగ్రామంగా మార్చడానికి కృషి చేస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

కొండపాకలో ఇంటింటికి మొక్కల పంపిణీ
కొండపాక : మండల కేంద్రంలో మంగళవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ చిట్టి మాధురి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ 5 మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు మంచాల అనసూయ, లక్ష్మీ, ఉపసర్పంచ్ భాస్కర్, వార్డు సభ్యులు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : జడ్పీటీసీ
వర్గల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని మండల జడ్పీటీసీ మామిండ్ల బాలమల్లుయాదవ్ కోరారు. మంగళవారం మండల పరిధిలోని తున్కిఖల్సా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోఎంపీటీసీ గొడుగు జనార్దన్‌తో కలిసి మొక్కను నాటి, అడవుల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సర్పంచ్ సంధ్యాజాని, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...