పచ్చదనంతో పర్యావరణానికి మేలు


Wed,August 14, 2019 12:06 AM

కొండపాక : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఎంపీపీ ర్యాగల్ల సుగుణదుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో హరితహారంలో భాగంగా మంగళవారం ఆమె పలుచోట్ల మొక్కలను నాటారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ... తరిగిపోయిన అడవి సంపదను తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని అందించాలని సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించిన మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ వసంత-రుషి, రాష్ట్ర సర్పంచుల ఫోరం కోశాధికారి చిట్టి మాధురి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దుర్గయ్య, రుషి పాల్గొన్నారు.

వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంపీపీ ర్యాగల్ల సుగుణ-దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో మంగళవారం ఆర్‌వీఎం దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఎంపీపీ ప్రారంభించారు. సుమారు 400మంది హాజరై వైద్యుల సలహాలు, సూచనలు, ఉచితంగా మందులను తీసుకున్నారు. గ్రామసర్పంచ్ వసంత-రుషి, ఆర్‌వీఎం దవాఖాన వైద్యులు మురళీకృష్ణ, శైలజ, మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్, సిబ్బంది కల్యాణ్, గణేశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...