రాష్ట్ర స్థాయి పుట్‌బాల్ పోటీల్లో సత్తా చాటిన ఉమ్మడి జిల్లా జట్టు


Wed,August 14, 2019 12:06 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : మంచిర్యాల పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ ఉమెన్స్ ఫుట్ బాల్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు విజేతగా నిలువ డంసంతోషకరమని జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఫుట్‌బాల్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సన్మా న కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ పాల్గొని క్రీడాకారులను సన్మానించారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని వసతులను కల్పిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచి క్రీడల్లో పాల్గొనడం వల్ల మంచి పిటినెస్‌తో ఉంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్టులో సిద్దిపేటకు చెందిన క్రీడాకారిణి నగ్మా (టిఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ మిట్టపల్లి) టోర్నమెంట్‌లో బెస్ట్ పార్వర్ఢ్ ప్లేయర్‌గా, నారాయణరావుపేట మండ లంలోని మాటిండ్లకు చెందిన భాగ్యమ్మ బెస్ట్ ప్లేయర్, బెస్ట్ గోల్‌కీపర్‌గా నిలువడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి భిక్షపతి, పుట్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జాయింట్ సెక్రటరీ నగేశ్, కోచ్ ఆజార్, మేనేజర్ ప్రశాంత్, సంఘం నాయకులు ఆక్బర్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...