ఆలయ భూములను కాపాడాలి


Wed,August 14, 2019 12:06 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : నాగపురి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 831, 832 భూమిలో హద్దులు నిర్ధారించాలని, నల్లపోచమ్మ చెరువు అన్యాక్రాంతాన్ని అరికట్టాలని, ఆలయ భూమిని కాపాడాలని కోరుతూ తహసీల్దార్ శైలజకు మంగళవారం నాగపురి సర్పంచ్ బండమీది సంతోషి ఆ ధ్వర్యంలో గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నల్లపోచమ్మ ఆలయం భూములు, చెరువు శిఖానికి హద్దులు నిర్ధారించినట్లు తెలిపారు. ఐనాపూర్ గ్రామానికి చెందిన దండ్యాల వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి హద్దులను తొలగించి ఆలయ భూమిలో నిర్మాణా లు చేపడుతున్న తెలిపారు. చెరువు శిఖం భూమి లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గతంలో రెవెన్యూ, ఐబీ అధికారులు నిర్ధారించారని వాటిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, నాయకులు బండమీది కరుణాకర్, బొడ్డు కిరణ్, గూడెపు మహేశ్, ప్రజ్ఞాపురం నర్సింహులు, మోకు దేవేందర్‌రెడ్డి, గుర్రాల మల్లేశం పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...